BREAKING
గుడ్డు ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ :పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలి: కేంద్ర మంత్రి సోనోవాల్‌తో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి! నాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ధ్వజం: రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారంటూ మండిపాటు! దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి టీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు ప్రారంభం జింకల భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నాణేల విక్రమార్కుడు “Save Coins – Save Heritage” నినాదంతో చరిత్రను పిల్లల చేతికందిస్తున్న కలుగొట్ల ఉపాధ్యాయుడు కనికె నగేష్ బాబు టి ఎస్ ఆర్ టి సి ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం దసరా సెలవుల్లో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం గా కావాలి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌పై పిమ్‌కో హెచ్చరిక టీసీఎస్ ఏఐ వ్యూహంలో 'కీ-మ్యాన్' రిస్క్ అమెరికా క్రూడాయిడ్ దిగుమతులకు ఆసియా దేశాల బ్రేక్ ఫ్రాన్స్‌లో సర్కారు బడులకు పెరుగుతున్న గుదిబండ

సమరానికి జనసేన సై..

Select Suryaa Now
సమరానికి జనసేన సై..

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమగ్ర వ్యూహంతో ముందుకుసాగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమన్వయం పెంచేందుకు ప్రత్యేకంగా స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీయ పర్యవేక్షణలోనే ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలు పనిచేయనున్నాయి. ఈ కమిటీలు క్షేత్రస్థాయి నుంచి వాస్తవ పరిస్థితులు, సమాచారాన్ని సేకరించి నివేదికలను సిద్ధం చేసి, స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కేంద్ర కమిటీ ద్వారా అధ్యక్షుడికి అందిస్తాయి. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి ప్రచారం, మరియు పొత్తుల సమన్వయం సులభతరం చేసేందుకే ఈ భారీ స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.