రాత్రివేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా..
అన్నమయ్య జిల్లా, మదనపల్లి
జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* ఆదేశాలతో పోలీసులు రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా, వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.రాత్రి విధులు నిర్వహించే సిబ్బందిని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.ప్రయాణికుల భద్రత కోసం "ఫేస్ వాష్ అండ్ గో" అమలు చేయడంతో పాటు ఏటీఎంలు, బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు, నివాస ప్రాంతాలు, జిల్లా సరిహద్దులతో పాటు దేవాలయాల వద్ద భద్రతను పెంచి అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 112 కు సమాచారం అందించాలని కోరారు.
పి. గౌరి శంకర్., స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె, అన్నమ్మయ్య జిల్లా..