BREAKING
పేద రోగులకు అండగా వీల్‌చైర్ బ్యాంక్.. అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందజేసిన టీసీ వరుణ్ ఓటీటీలో మరో ప్రముఖ వేదికపైకి లోకేశ్ కనగరాజ్ 'డిసి' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7 రేపటినుంచి స్కూల్స్, కాలేజీలు బంద్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి దుమ్ము ధూళితో నరకయాతన... బైక్‌ అదుపుతప్పి రాయిని ఢీకొని యువకుడి దుర్మరణం రెవెన్యూ మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన షెడ్యూల్ తెలంగాణలో 95 లక్షల ఓట్ల తేడాపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌! నంద్యాలలో నవ నారసింహులకు పంచామృత అభిషేకం రేపటినుండి పాఠశాలలకు దసరా సెలవులు బండి సంజయ్ భవానీ దీక్ష షురూ… సలుగుపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఒక్క సి.సి. కెమెరా వందమంది పోలీసులతో సమానం*

సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య?

Select Suryaa Now
సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య?

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోరీ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. చోరీకి గురైన సెల్‌ఫోన్‌ను తిరిగి తీసుకునేందుకు వెళ్లిన సమయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటన చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చేవెళ్ల బస్టాండ్ ఆవరణలో వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, కొంత నగదు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో చేవెళ్లకు చెందిన కృష్ణ, సాయి విజయ్, రాజు తదితరులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సెల్‌ఫోన్ గురించి బాధితుడు నిలదీయగా.. ఫోన్‌ను డంపింగ్ యార్డ్ సమీపంలో దాచినట్లు వారు చెప్పినట్లు సమాచారం. దీంతో ఫోన్‌ను తిరిగి తీసుకునేందుకు బాధితుడు, నిందితులుగా అనుమానిస్తున్న వ్యక్తులు కలిసి మోటార్‌సైకిల్‌పై డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సెల్‌ఫోన్ విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, అతడు మృతి చెందినట్లు  సమాచారం.
విషయం తెలుసుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. చోరీ ఘటనతో పాటు డంపింగ్ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

సూర్య చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా.