BREAKING
ఏపీకి వర్ష సూచన విజయ్ సేతుపతి ‘భత్తా’ 7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు: వారంలో ₹14 కోట్లకు పైగా వసూళ్లు యూఏఈ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి మొక్కలతోనే సమాజ మనుగడ. *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య?

స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం

సూర్య, నంద్యాల బ్యూరో: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. నంద్యాల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పై నేపథ్యంలో నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, బేతంచెర్ల ఆత్మకూరు నియోజకవర్గాల ముఖ్య నేతలతో నంద్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమావేశం అయ్యారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు
ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపిక, పార్టీతో వారి బంధం, అనేక అంశాలపై సమీక్ష నిర్వహించారు.   
మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై పార్టీ శ్రేణులతో ఆయన సుదీర్ఘంగా చర్చించి కసరత్తు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి, కో-ఇన్‌ఛార్జి, రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*