BREAKING
విజయ్ సేతుపతి ‘భత్తా’ 7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు: వారంలో ₹14 కోట్లకు పైగా వసూళ్లు యూఏఈ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి మొక్కలతోనే సమాజ మనుగడ. *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య? పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Select Suryaa Now
*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

 

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాప్రా మున్సిపల్ ఆఫీస్ (కాప్రా సర్కిల్ ఆఫీస్)లో డీసీ నిత్యానంద ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమైన సన్నాహక సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

డిప్యూటీ కమిషనర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాచారం డివిజన్ కి చెందిన అన్ని స్థాయిల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహకాలు, క్షేత్రస్థాయి సమన్వయం, ఓటర్లతో సంప్రదింపులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై నాయకులతో చర్చించారు.


గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలు మరియు అభిప్రాయాలను తెలుసుకుని సంబంధిత అంశాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో అన్ని స్థాయిల పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.