BREAKING
గ్లోబల్ వార్మింగ్ కట్టడికి అత్యవసర చర్యలు....వాతావరణ సదస్సులో హెచ్చరికలు బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెపో సంస్కరణలపై హెడ్జ్ ఫండ్స్ హెచ్చరిక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక మైలురాయి కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం అమెరికాలో తగ్గుతున్న లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు ఉగాండా డాంగోట్ రిఫైనరీలో వాటాల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ బిగ్ టెక్ దిగ్గజాలపై బ్రస్సెల్స్ పన్ను పంజా ప్రజల నమ్మకమే నా అతిపెద్ద బలం: ఎలన్ మస్క్ టెరాఫాబ్ వెంచర్‌తో కలిసి పనిచేయనున్న ఇంటెల్ మయన్మార్ సైనిక పాలకులు మలేషియాలో అడుగు ఫ్రాన్స్‌కు ఆర్థిక తప్పిదాలకు తావు లేదు: సిటాడెల్ హెచ్చరిక పామెనలో కరెంటు కష్టాలు! స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గుంజ పూజ కార్యక్రమం కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…?

పామెనలో కరెంటు కష్టాలు!

Select Suryaa Now
పామెనలో కరెంటు కష్టాలు!

-లోవోల్టేజీ.. విద్యుత్‌ కోతలతో ఎండుతున్న పంటలు
-బోరు మోటర్లు పనిచేయక రైతుల అవస్థలు

చేవెళ్ల మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలోని పామెన గ్రామ రైతులకు విద్యుత్‌ సమస్యలు తలనొప్పిగా మారాయి. వర్షాలు సకాలంలో కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా.. విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యలు రైతుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి.

పంటలకు సాగునీరు అందించేందుకు బోరు మోటర్లపై ఆధారపడుతున్న రైతులు లోవోల్టేజీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వోల్టేజీ కారణంగా మోటర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో పాటు తరచూ కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో నీటిని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతింటుండగా.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలకు నీరు అందకపోతే నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి పామెన గ్రామంలోని విద్యుత్‌ సరఫరా పరిస్థితిని పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. లోవోల్టేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జూలూరి అశోక్ : చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ - మేజర్ న్యూస్.