BREAKING
బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెపో సంస్కరణలపై హెడ్జ్ ఫండ్స్ హెచ్చరిక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక మైలురాయి కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం అమెరికాలో తగ్గుతున్న లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు ఉగాండా డాంగోట్ రిఫైనరీలో వాటాల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ బిగ్ టెక్ దిగ్గజాలపై బ్రస్సెల్స్ పన్ను పంజా ప్రజల నమ్మకమే నా అతిపెద్ద బలం: ఎలన్ మస్క్ టెరాఫాబ్ వెంచర్‌తో కలిసి పనిచేయనున్న ఇంటెల్ మయన్మార్ సైనిక పాలకులు మలేషియాలో అడుగు ఫ్రాన్స్‌కు ఆర్థిక తప్పిదాలకు తావు లేదు: సిటాడెల్ హెచ్చరిక పామెనలో కరెంటు కష్టాలు! స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గుంజ పూజ కార్యక్రమం కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…? ఇజ్రాయెల్‌లో హమాస్ దాడికి మూడేళ్లు: ఘనంగా స్మారక కార్యక్రమాలు

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

Select Suryaa Now
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన.  

 

 డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, పాస్ వర్డ్ లు, ఓటీపీలను ఎవ్వరికి వెల్లడించకూడదన, పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఎస్సై లక్ష్మయ్య తో కలిసి జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధిలో ఉన్న త్రిపుర జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఇన్స్పెక్టర్ విద్యార్థులకు సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానస్పద లింకులు, సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దని అన్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం ఓటీపీల వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే 1930 ఫైబర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో త్రిపుర కళాశాల విద్యార్థులు, పహాడీ షరీఫ్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.                        

 

- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.