స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠ గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.