BREAKING
ఎలన్ మస్క్ టెరాఫాబ్ వెంచర్‌తో కలిసి పనిచేయనున్న ఇంటెల్ మయన్మార్ సైనిక పాలకులు మలేషియాలో అడుగు ఫ్రాన్స్‌కు ఆర్థిక తప్పిదాలకు తావు లేదు: సిటాడెల్ హెచ్చరిక పామెనలో కరెంటు కష్టాలు! స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గుంజ పూజ కార్యక్రమం కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…? ఇజ్రాయెల్‌లో హమాస్ దాడికి మూడేళ్లు: ఘనంగా స్మారక కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బియ్యం ధరలు స్థలం ఆక్రమించారని ఆరోపణ హెచ్‌ఎస్‌బీసీ యూకే వెల్త్ మేనేజ్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత సౌత్ కొరియాలో ఏఐ టూల్స్‌తో మెగా చర్చిల డేటా చోరీ జపాన్‌లోని ఒకినావాలో అమెరికా సైనికులకు కఠిన ఆంక్షలు కెనరా బ్యాంక్ నుంచి జేఎన్‌టీయూ సీఈఏకు మూడు డిజిటల్ బోర్డులు వేంకటేశ్వరస్వామి టెంపుల్ లో పూజలు

కెనరా బ్యాంక్ నుంచి జేఎన్‌టీయూ సీఈఏకు మూడు డిజిటల్ బోర్డులు

Select Suryaa Now
కెనరా బ్యాంక్ నుంచి జేఎన్‌టీయూ సీఈఏకు మూడు డిజిటల్ బోర్డులు

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అనంతపురానికి కెనరా బ్యాంక్ శారదానగర్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కార్యక్రమం కింద రూ.3 లక్షల విలువైన మూడు డిజిటల్ బోర్డులను అందజేశారు.
కెనరా బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ ఐ. శ్రీనివాసులు, విభాగ మేనేజర్ నరేష్ రెడ్డి, శాఖ మేనేజర్ ఎం. నాగరాజు డిజిటల్ బోర్డులను జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావుకు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్, సీఈఏ కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ డిజిటల్ బోర్డులు విద్యార్థులకు ఆధునిక బోధనా విధానాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా సహకరించిన కెనరా బ్యాంక్ అధికారులకు జేఎన్‌టీయూ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.