ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు
ప్రభుత్వ నాయకత్వంలో నిరంతరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2014 నుంచి భారత ప్రధానమంత్రిగా దేశానికి సారథ్యం వహిస్తున్న మోదీ ప్రస్థానం క్రమశిక్షణ, పట్టుదల, ప్రజాసేవ పట్ల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. గుజరాత్‌లో ప్రజల విశ్వాసాన్ని చూరగొని, జాతీయ స్థాయిలో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఆయన నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చాటుతోందన్నారు.