తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బియ్యం ధరలు
గత నాలుగు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. సన్నబియ్యం ధర రూ.55 నుంచి రూ.83కు చేరగా, నాణ్యత తక్కువ గల బియ్యం కూడా రూ.60 పైనే పలుకుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ధాన్యం దిగుబడి తగ్గడం, యాసంగి సాగు విస్తీర్ణం తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడం, మిల్లర్ల అక్రమాలు, ప్రభుత్వ ధాన్యం మాయం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ వంటి కారణాలతో ధరలు పెరిగాయి