జగిత్యాల కు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జగిత్యాల బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఆందే మారుతి, పీపీ బిట్ల నర్సయ్య, పాక్స్ చైర్మెన్ దామోదర్ రావు,బుసరపు శ్రీనివాస్ గౌడ్,రాచకొండ శ్రీ రాములు, సాయిల్ల మురళి, నరేందర్,జంగిలి మల్లికార్జున్ జాయింట్ సెక్రటరీ బెజ్జరపు ప్రవీణ్, పాల్గొన్నారు.