BREAKING
రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష తూర్పు జెరూసలేం కాన్సులేట్ బోర్డులను తొలగించిన బ్రిటన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో నేడు చంద్ర బాబు భేటీ వికారాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ నేడు ఎస్‌ఈసీ కీలక సమీక్ష: కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ మయన్మార్ సైనిక ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష చర్చలు కొందుర్గు స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో కార్మికుడి మృతి.... స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలి లింగాల గ్రామంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డుల పంపిణీ జడ్పీ హైస్కూల్ కు ఆట వస్తువులు వితరణ కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా చెల్లాపూర్‌లో రోడ్డుపై మురుగునీరు.. పట్టించుకోని అధికారులు కోట్ డి ఐవోర్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ: ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై కీలక చర్చలు! భూమి కోసం రక్తసంబంధాన్ని మరిచిన కొడుకు.. నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీసీఎస్ క్యూ2 పనితీరు: గత ఐదేళ్లలో ఐటీ దిగ్గజం ప్రయాణం.. కీలక మైలురాళ్లు మరియు ఆర్థిక గణాంకాలు!

కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా

Select Suryaa Now
కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా


ధారూర్, మేజర్ న్యూస్:విద్యుత్ కోతలతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన రైతులు రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆందోళన సందర్భంగా సంబంధిత అధికారి వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధర్నాను ఉధృతం చేశారు. దీంతో వికారాబాద్ – తాండూర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా స్థంభించిపోయి, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
స్పీకర్ సొంత నియోజకవర్గంలో, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కరెంటు కష్టాలు ఇలా ఉండటం విచారకరం" అని, సరైన విద్యుత్ అందక పంటలన్నీ కళ్లముందే ఎండిపోతున్నాయని వాపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన రైతులతో చర్చలు జరిపారు. త్వరలోనే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.

రిపోర్టర్: సుధాకర్,ధారూర్, వికారాబాద్ జిల్లా.