గోదావరిలో దూకిన దుమ్ముగూడెం యువకుడు.
గోదావరిలో దూకిన దుమ్ముగూడెం యువకుడు.
దుమ్ముగూడెం,సూర్య న్యూస్, (కల్లూరి సుమన్):
మద్యం మత్తులో గోదావరి బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకిన దుమ్ముగూడెం యువకుడిని భద్రాచలం పోలీసులు చాకచక్యంగా రెస్క్యూ చేసి కాపాడారు.వారు తెలిపిన వివరాల ప్రకారం..దుమ్ముగూడెం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన జంపన్న (20) అనే యువకుడు మద్యం మత్తులో భద్రాచలం - సారపాక మధ్య ఉన్న గోదావరి బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకాడు. అదృష్టవశాత్తూ అతడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి స్పృహకోల్పోయి నది మధ్యలోని ఒక ఇసుక తిన్నె (దీవి) వద్ద చిక్కుకుపోయాడు.తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చిన జంపన్న భయంతో కేకలు వేశాడు. ఆ శబ్దాలు విన్న వాహనదారులు వెంటనే భద్రాచలం పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న నూతన సీఐ సట్ల రాజు తమ సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని,చాకచక్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి యువకుడిని సురక్షితంగా బయటకు తీశారు.అనంతరం అతడిని ప్రథమ చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ యువకుడిని కాపాడిన సీఐ సట్ల రాజును, పోలీసు సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు.