BREAKING
కడియంలో వైన్స్‌ షాపులు ఇష్టారాజ్యం! ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు! సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ. ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి

ప్రజా అవసరాల కోసం సొంత నిధులతో సీసీ రోడ్డు…!

Select Suryaa Now
ప్రజా అవసరాల కోసం సొంత నిధులతో సీసీ రోడ్డు…!

శామీర్‌పేటలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన జిల్లా బీజేపీ కార్యదర్శి విలాసాగరం సుదర్శన్

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 09):ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ కార్యదర్శి విలాసాగరం సుదర్శన్ తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట డివిజన్‌లో శామీర్‌పేట గ్రామంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం నుంచి నల్సార్ జంక్షన్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ...…ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రజా అవసరాల కోసం సొంత నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సుదర్శన్‌ను గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, శామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.