నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రముఖ నటులు నానా పటేకర్ ఆకస్మిక మరణ వార్త తెలిసి చింతిస్తున్నాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు నానా పటేకర్. క్రాంతివీర్ చిత్రంలో ఆయన నటన మరచిపోలేనిది. పరిందా, ఖామోషీ, తిరంగా, అగ్నిసాక్షి, నటసామ్రాట్, అబ్ తక్ చప్పన్, అపహరణ్ లాంటి చిత్రాలు ఆయన నట జీవితంలో కొన్ని మచ్చు తునకలు. భారత సైన్యంలోనూ గౌరవపూర్వక సేవలందించారు. శ్రీ నానా పటేకర్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.