గుత్తి చెరువు కట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి
అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి మండలం కేంద్రం సమీపంలో ఉన్న చెరువు కట్ట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.
ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు వెల్లడించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతుల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.