BREAKING
కోట్ డి ఐవోర్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ: ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై కీలక చర్చలు! భూమి కోసం రక్తసంబంధాన్ని మరిచిన కొడుకు.. నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీసీఎస్ క్యూ2 పనితీరు: గత ఐదేళ్లలో ఐటీ దిగ్గజం ప్రయాణం.. కీలక మైలురాళ్లు మరియు ఆర్థిక గణాంకాలు! గూగుల్ ఫిన్‌లాండ్ ఏఐ ప్రాజెక్టులకు పర్యావరణ బ్రేక్: రెండు భారీ డేటా సెంటర్ల నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేత! ఓలా ఎలక్ట్రిక్ రూ. 1,000 కోట్ల రైట్స్ ఇష్యూకి ఆమోదం: 26 శాతం డిస్కౌంట్‌తో షేర్ల కేటాయింపు! టాటా ఏరిస్ సీఎన్‌జీ 39 కి.మీ మైలేజ్ నిజమేనా: అధికారిక గణాంకాలు మరియు అసలు వాస్తవాలు ఇవే! గాల్లో ఉండగా ఇండిగో విమానాన్ని తాకిన పిడుగు: దెబ్బతిన్న నోస్ భాగం.. లక్నోలో సురక్షిత ల్యాండింగ్! రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల ఆచూకీలభ్యం విద్యార్థులకు 600 సైకిళ్ల పంపిణీ. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల విరుచుపాటు: 24 మంది మృతి.. అత్యంత హేయమైన దాడిగా జెలెన్‌స్కీ ఖండన! సింగపూర్‌లో పంజాబ్, హర్యానా ప్రవాస పారిశ్రామికవేత్తలతో సీఎం నయాబ్ సింగ్ సైనీ భేటీ: రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం! అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్: వర్క్ పర్మిట్ కోసం 70 వేల డాలర్ల ఫీజు.. ట్రంప్ సర్కారు సంచలన ప్రతిపాదన! విలేఖరి డి బాబురావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు భారత్-కెనడా మధ్య రక్షణ సంబంధాల బలోపేతం: ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలపై దృష్టి!

విద్యార్థులకు 600 సైకిళ్ల పంపిణీ.

Select Suryaa Now
విద్యార్థులకు 600 సైకిళ్ల పంపిణీ.

 

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి రంగస్వామి :-

 

 కుందుర్పి మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో 600 సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం (09-10-2026) ఉదయం 8.30 గంటలకు కుందుర్పి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు జి. ధనుంజయ తెలిపారు. కుందుర్పి జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు వచ్చే విద్యార్థుల రాకపోకలకు సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడంతో పాటు వారి ప్రయాణ ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా కుందుర్పి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు జి. ధనుంజయ విజ్ఞప్తి చేశారు.