BREAKING
దసరా సెలవుల్లో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం గా కావాలి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌పై పిమ్‌కో హెచ్చరిక టీసీఎస్ ఏఐ వ్యూహంలో 'కీ-మ్యాన్' రిస్క్ అమెరికా క్రూడాయిడ్ దిగుమతులకు ఆసియా దేశాల బ్రేక్ ఫ్రాన్స్‌లో సర్కారు బడులకు పెరుగుతున్న గుదిబండ బ్యాంకులు, ఏజెన్సీల దిగుమతులపై 3 శాతం ఐజీఎస్‌టీ విధింపు యూరోపియన్ కార్ల తయారీదారులకు పెరుగుతున్న ఒత్తిడి సరిహద్దు పెట్టుబడులకు అడ్డుగా మారుతున్న నిబంధనల గోడలు అమెరికాలోనూ తగ్గుతున్న కొనుగోళ్లు, గడ్డుకాలం ఎదుర్కొంటున్న దిగ్గజాలు రఫీ వైద్యానికి మంత్రి గొట్టిపాటి భరోసా.. రూ.1.73 లక్షల LOC మంజూరు. నెమ్మదిగా సాగుతున్న చైనా బుల్ మార్కెట్ కృత్రిమ మేధస్సు ఐపీవోలకు ఎదురుదెబ్బ అమెరికాలో ఉత్కంఠ రేపుతున్న టర్మ్ ప్రీమియం పెరుగుదల ఉక్రెయిన్ నగరాలను వేధిస్తున్న గగనతల రక్షణ కొరత సిద్దిపేట జిల్లా దశాబ్ది సంబురాలు ప్రారంభం: హరీష్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా 10K రన్!

భూమి కోసం రక్తసంబంధాన్ని మరిచిన కొడుకు..

Select Suryaa Now
భూమి కోసం రక్తసంబంధాన్ని మరిచిన కొడుకు..

 

 తండ్రిని రాయితో కొట్టి హత్య… భూమి కోసం కన్నతండ్రినే హతమార్చిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు భాగం పోచయ్య (70). నిందితుడు అతని కుమారుడు భాగం మల్లేష్ గా పోలీసులు గుర్తించారు. భూ వివాదమే హత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

స్థానికుల కథనం ప్రకారం.. మల్లేష్ మద్యానికి బానిసై కుటుంబ భూమిలో కొంత భాగాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. మిగిలిన భూమిని కూడా తన పేరుపై రాయాలని తండ్రిని చాలాకాలంగా వేధిస్తున్నాడు. మనవళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోచయ్య నిరాకరించడంతో తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మల్లేష్ ఆగ్రహంతో ఊగిపోయి, నిద్రిస్తున్న తండ్రి తలపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేస  నమోదు నమోద చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు 

 

M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్…..