BREAKING
హైదరాబాద్‌లో తీవ్రమవుతున్న నీటి ఎద్దడి: కారణాలు మరియు పరిష్కారాలు త్రివిక్రమ్‌ను 'మా' ఎందుకు ప్రశ్నించట్లేదు.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్! సుస్మిత కొణిదల అమ్మవారి దర్శనం రేపటినుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు దసరా సెలవులతో సొంతూళ్లకు కదులుతున్న జనం ఓటీటీలోకి 'ప్రేమలు' నటుడి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే! రాజ్ భవన్ ముట్టడికి యత్నం షై హోప్ విధ్వంసకర సెంచరీ.. టీమిండియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక రికార్డు విజయం! ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా శిథిలాల కింద కొనసాగుతున్న సహాయక చర్యలు ఓట్ల దొంగ జ్ఞానేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి విబిజి రామ్ జీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం* మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు. సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. 12 వేలకు పైగా ప్రత్యేక బస్సులు! రూపాయి విలువను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల హవా: ఆస్ట్రేలియా 187/6

కుల్కచర్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

Select Suryaa Now
కుల్కచర్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

107 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌

54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 34 లీటర్ల మద్యం స్వాధీనం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీసులు కుల్కచర్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆదేశాల మేరకు పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ పర్యవేక్షణలో శుక్రవారం తెల్లవారుజామున కుల్కచర్ల మండల కేంద్రంలోని కిండిగేరి ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేపట్టారు.ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 107 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళ్లతో పాటు వాహనాలను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించారు. వాహనాల పత్రాలు, ఇతర వివరాలను తనిఖీ చేసే క్రమంలో 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 34 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరు రౌడీషీటర్లను తనిఖీ చేసి వారి వివరాలను పరిశీలించారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: డీఎస్పీ శ్రీనివాస్

ఈ సందర్భంగా పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గ్రామాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు నిందితులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు.కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ల ద్వారా పోలీసు–ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొడంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, పరిగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొండల్ రెడ్డి, కుల్కచర్ల, పరిగి, చెంగోముల్, దోమ, కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, 12 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.