BREAKING
విడతలవారీగా గ్రామాభివృద్ధికి కృషి విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. కాక్రోచ్ పోస్ట్ నిరసనలతో కేంద్ర ప్రభుత్వానికి అభిజీత్ దిప్కే సవాల్ బీసీలకు పూర్తి అండగా టీడీపీ అనర్హత కలిగిన సోదరుడికి పెన్షన్ ఇవ్వద్దు అంటూ ఫిర్యాదు అటవీ ప్రాంతంలో అక్రమ సారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎంను కలిసిన రైతులు మహాలయ అమావాస్య సందర్భంగా సామూహిక తిలతర్పణాలు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి నూతన డీఎస్పీకి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కంటి శుభ్రత చాలా ముఖ్యం -- లయన్ కొత్త సుభద్ర. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా అందజేత బీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలి డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం: బీసీ హక్కుల పోరాట సమితి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కీసర శ్రద్ధ కళాశాలలో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.! తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు – మాగుంట

రేపటినుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

Select Suryaa Now
రేపటినుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

రేపటి నుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

బాలాపూర్ మండలం, జల్ పల్లి సర్కిల్ పరిధి, మామిడిపల్లిలో వెలసిన అతి ప్రాచీనమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు 11ఆదివారం నుండి 16శుక్రవారం వరకు వారం రోజులపాటు బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఆలయ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్ తెలిపారు. ఆలయ ఈఓ మురళీకృష్ణ, డైరెక్టర్లు చీమలదారి చెన్నయ్య, గొండ్యాల శేఖర్, ఎలిగపల్లి అనిత, కానుగల భాస్కర్, గుర్జని రాధిక, ఉండేకారి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, భక్తుల సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నాడు అంకురార్పణ తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించి,12 సోమవారం బాల భోగము, యాగశాల ప్రవేశము, విష్ణు సహస్ర పారాయణం నిర్వహించనున్నారు. 13న మంగళవారం 11గంటలకు స్వామివారి తిరు కళ్యాణం, అన్న ప్రసాద వితరణ ఉంటుందని, సాయంత్రం 6గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, హవనము, శేష వాహన సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 14,15 16న బాలభోగము, హవనము, బలిహారము, మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.       

      -అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.