కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కంటి శుభ్రత చాలా ముఖ్యం -- లయన్ కొత్త సుభద్ర.
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కళ్లను తాకడానికి లేదా నలపడానికి ముందే ఎల్లప్పుడూ మీ చేతులను సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడుక్కోవాలని వనిత లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు లయన్ కొత్త సుభద్ర అన్నారు. రీజయన్ చైర్ పర్సన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణం రాజు సౌజన్యంతో కడియద్ద జిల్లా పరిషత్ హైస్కులు లో వనిత లయన్స్ క్లబ్ తరుపున కంటి శుభ్రత అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ కళ్లను నలపకండి, కళ్లలోకి దుమ్ము వెళ్లినప్పుడు చేతులతో గట్టిగా నలపకూడదుని దీనివల్ల కంటిపై గీతలు పడటం లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు కు వివరించారు. లయన్ లక్ష్మి లలిత మాట్లాడుతూ ముఖం, కళ్ళు ప్రక్షాళన చల్లని నీటితో రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు స్వచ్ఛమైన, చల్లని నీటితో కళ్లను మెల్లగా కడుక్కోవాలన్నారు. లయన్స్ జిల్లా 316జి గవర్నర్ లయన్ డాక్టర్ దశక సుబ్బారావు పిలుపు మేరకు డైమండ్స్ లయన్స్ వనిత లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో కంటి సంరక్షణ శిబిరాలు 3వ రోజుకు చేరుకున్నాయని రీజయన్ చైర్ పర్సన్ లయన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణం రాజు సహకారం తో రూరల్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ కంటి పరిరక్షణ జాగ్రత్త లు విద్యార్థులు కు అవగాహనా కార్యక్రమం లు చేపట్టామ్ అన్నారు. ఈ కార్యక్రమం లో లయన్స్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా