BREAKING
పర్యాటకంగా ఏపీని నంబర్-1 దిశగా నడిపిస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అవనిగడ్డ డిపో నుండి దసరా ప్రత్యేక బస్సులు కళ్యాణదుర్గంలో ఉచిత మెగా గుండె వైద్య శిబిరం. 110 వైద్య పరీక్షలు. రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి 108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం అహ్మదాబాద్‌లో 'బ్రిక్స్ సాంప్రదాయ క్రీడా సంబరాలు' కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ

విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు..

Select Suryaa Now
విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు..

 అప్పుల ఊబిలో అన్నదాతలు….

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం…

రైతుల పంటలను కాపాడండి.. నిరంతర విద్యుత్ సరఫరా అందించండి….

షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని నర్సాప్పగూడ గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చెేశారు. శనివారం నర్సప్పగూడ గ్రామంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  గత వర్షాకాలంలో మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుతం విద్యుత్ కోతలతో వరి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి , విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించి, రైతుల పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్ అందించాలని కోరారు. విద్యుత్ కోతలకు పరిష్కారం చూపాలి అని, రైతుల పంటలను కాపాడాలి అని, రైతుల కన్నీళ్లు తుడిచే వరకు బీజేపీ పోరాటం ఆగదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు వడ్ల అరవింద్ చారి,  ఉప సర్పంచ్ అప్పల సిద్దయ్య,  బి. లక్ష్మణ్ గౌడ్, నక్కల అశోక్, బి. వెంకటేష్, నీరటి మహేందర్, మంగలి లక్ష్మణ్, అంజయ్య, రాములు, లింగం, బాలరాజ్, శ్రీశైలం, కృష్ణమోహన్ గుప్తా, జంగయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం తదితరులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

ప్రభాకర్, మేజర్ న్యూస్ నందిగామ…