BREAKING
భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

Select Suryaa Now
ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

గూడూరు, మేజర్‌న్యూస్‌  :   ఓటు చోరీ కి పాల్పడిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్  వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ నాయకులు  సివిఆర్ కుమార్ డిమాండ్‌ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ రాజధాని డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద  ఓటు చోరీకి పాల్పడిన భారత ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని సిజెపి అధ్వర్యంలో వామ పక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అన్నారు. తప్పు చేసిన జ్ఞానేశ్ కుమార్‌కు అందలం కల్పించి ప్రశ్నించే గొంతుకులపై అణచివేత ధోరణి ఎందుకని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే పోలీసులు సిఇఐ, వామపక్ష నాయకులు, విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకొని వాళ్లను నిర్బంధించడం నిరంకుశమన్నారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు పోరాటం సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణికి ప్రజలు అందరూ ఏకమై ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడాలన్నారు . ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ యాదాల సునీల్, ఎఐవైఎఫ్ జిల్లా నాయకులు సివిఎల్ మస్తాన్, మహీర్, ఏడు కొండలు, శివ తదితరులు పాల్గొన్నారు.