BREAKING
బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీరివ్వాలి...! చిన్న వెంకన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నేడే సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్. పేదలకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఎంబీబీఎస్ సీటు సాధించిన రాథోడ్వ విష్ణువర్షను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. విద్యార్థినులు సామాజిక సేవలో భాగస్వామ్యులు కావాలి

గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు

Select Suryaa Now
గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. 	               రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు

 రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు
అమరావతి,అక్టోబరు 10:పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు భరోసా కలిగిందంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు డా.నిమ్మల రామానాయుడు అన్నారు.కరువుసీమ సైతం జలకళతో కళకళలాడుతుందంటే పట్టిసీమే ప్రధాన కారణంగా నిలవడం గర్వకారణమని  మంత్రి పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి అనుభవం,ఆలోచనా విధానం, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంతటి అద్భుత ఫలితాలు, సత్ఫలితాలు ఇస్తాయో పట్టిసీమ ప్రాజెక్టే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.ఆనాడు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి 1600 కోట్ల రూ.లు ఖర్చు చేస్తే నేడు రూ.50,000 కోట్ల సంపద సృష్టించబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలను ఇచ్చిందన్నారు.ఇది ఇంజనీరింగ్ అద్భుతమే కాక లక్షలాది రైతుల కలల ప్రాజెక్టు అని పేర్కొన్నారు.ఈ సూపర్ ఎల్ నినో సంవత్సరంలోను వర్షపు చుక్క కోసం ఎదురుచూసే పరిస్థితితో పాటు భూగర్భ జలాలు అడుగంటి ఎండలు మండుతున్నా మరో వైపు గోదావరి నుంచి ఈ ఏడాది 57 టీఎంసీల నీరు కృష్ణాకు చేరటం హర్షనీయమన్నారు. దీంతో కృష్ణా డెల్టాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందటంతో పాటు  30 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించగలిగామన్నారు.పట్టిసీమ ఉండబట్టే నేడు దాహార్తి తీర్చుకోగలుగుతున్నామని, పంటలు పండించుకుంటున్నామని డెల్టా ప్రాంత రైతాంగం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. 
        ఈ ఏడాది వర్షాలు పడని గడ్డు పరిస్థితుల్లో  పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసమైనా శ్రీశైలం నుంచి కనీసం 30 నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకురావాల్సి వచ్చేదని, పట్టిసీమ ద్వారా డెల్టాకు 57 టిఎంసీల నీటిని తరలించడం ద్వారా  శ్రీశైలం నుంచి ఒక్క చుక్క నీరు కూడా డెల్టాకు తీసుకోకుండా ఆ నీరంతా రాయలసీమ అవసరాలకు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో తాగునీటికి వినియోగించుకో గలుగుతున్నామన్నారు. ప్రత్యక్షంగా కృష్ణా డెల్టాను ఆదుకుంటూనే, పరోక్షంగా రాయలసీమకు పట్టిసీమ ఊపిరి పోసిందన్నారు.ఈ ఏడాది శ్రీశైలానికి 200 టీఎంసీలు నీరు కూడా రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ రైతులకు బంగారు సీమగా మారిందన్నారు.2014-19 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పట్టిసీమపై ఏ విధంగా మాట్లాడారో రికార్డుల్లో ఉందన్నారు.పట్టిసీమను 'ఒట్టిసీమ' అని, ఖర్చు పెట్టిన డబ్బంతా 'వృధా' అని, పంపులు పనికిరావని, అధికారంలోకి వస్తే 'పంపులు పీకేస్తానని' అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ ప్రాంత రైతాంగం చెవుల్లో మార్మోగుతునే ఉన్నాయన్నారు.జగన్ మోహన్ రెడ్డి పనికిరాదు, పీకేస్తానన్న పట్టిసీమే నేడు రాష్ట్రానికి 500 టీఎంసీల నీరిచ్చింది, ఈ కరవు సంవత్సరంలోనూ 57 టీఎంసీల నీరిచ్చి రూ.50,000 కోట్ల సంపదను సృష్టించిందని తెలిపారు. రాయలసీమకు, కృష్ణా డెల్టాకు జీవం పోసిన పట్టిసీమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పినా రాష్ట్ర రైతాంగం అతన్ని క్షమించే పరిస్థితి లేదన్నారు.జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ విషయంలో ఏం చేశాడనేది 2015 నుంచి ఈ సంవత్సరం వరకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని ముఖ్యంగా ఈ సూపర్ ఎల్ నినో సంవత్సరంలో అది స్పష్టంగా రుజువైందన్నారు. 
       గోదావరి జిల్లా వాసిగా చెబుతున్నా తీవ్రమైన ఎల్ నినో సంవత్సరంలోనూ నేటి వరకు దాదాపు 1,550 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోయింది, ఇంకా పోతూనే ఉంది.కృష్ణా నదిలో ఈ ఏడాది మొత్తం కలిపినా 200 టీఎంసీల నీరు రాలేదు  కానీ గోదావరిలో కేవలం రెండు రోజుల్లోనే 250 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని,గోదావరి వరద నీటిని ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకు తరలించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన ముందుచూపు అద్భుతమన్నారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపే సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకోవాలనే మహత్తర ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు రూ. 1,600 కోట్లతో పట్టిసీమకు రూపకల్పన చేశారని, తద్వారా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడారని కొనియాడారు. 
        రూ.1600 కోట్ల వ్యయంతో నేటికి రూ. 50,000 కోట్లకు పైబడి సంపద సృష్టిస్తే ఇప్పుడు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని రాజకీయాల్లో ఉంటారని రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.నాగలిని ఆయుధంగా మలిచి రాష్ట్రమంతా నీరు పారించి సస్యశ్యామలం చేసే ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ప్రజలు కోరుకుంటున్నారన్నారు.ఎన్ని రాజకీయ విమర్శలు ఎదురైనా, ప్రకృతి వైపరీత్యాలు అడ్డుపడినా ఇంజనీర్ల పట్టుదలతో, మహా సంకల్పంతో రైతుల ప్రయోజనాలను కాపాడిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
ఈ సమావేశంలో ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ లు డి. వెంకటేశ్వరరావు, మురళీధరరావు, రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, సాగునీటి సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.