రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:ఎల్ నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో రైతులు వరి కాకుండా ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మోతె రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తున్న నేపథ్యంలో పంటల సాగుకు ఎస్సారెస్పీ నుండి 6045 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారన్నారు. 9 రోజుల పాటు నీటి విడుదల కొ నసాగుతుందన్నారు