BREAKING
భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Select Suryaa Now
108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
సూర్య జైనూర్ : సిర్పూర్ (యు) మండలంలోని రాఘపూర్ గ్రామానికి చెందిన గర్భిణీ పెందూర్ గంగాదేవి 108 అంబులెన్స్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.వివరాల్లోకి వెళ్తే.. గంగాదేవికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్య సిబ్బంది సూచన మేరకు మెరుగైన ప్రసూతి వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆమెను 108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమయ్యాయి.దీంతో అప్రమత్తమైన 108 అంబులెన్స్ ఈఎంటీ రవి, పైలెట్ దయాకర్ అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అంబులెన్స్‌లోనే ప్రసూతి నిర్వహించారు. గంగాదేవి మొదటి కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు వారు తెలిపారు.అనంతరం తల్లీబిడ్డను ఉట్నూర్ ఆసుపత్రిలో చేర్పించగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి సురక్షితంగా ప్రసవం చేయడంపై గంగాదేవి కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.