లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా అందజేత
ఉండి, మేజర్ న్యూస్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనలో విరామం లేకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా ఉండి భవిత ప్రభుత్వ దివ్యాంగుల పాఠశాలకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన నూతన ఇనుప బీరువాను నేడు పాఠశాలకు లైన్స్ జిల్లా ద్వితీయ ఉప గవర్నర్ లయన్ వి సత్య స్వరూప్ చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే దివ్యాంగుల పాఠశాల విద్యార్థుల అవసరాల కోసం ఈ బీరువాను అందజేసినట్లు ఆయన తెలిపారు.ముఖ్య అతిథి, జిల్లా ఉప గవర్నర్ లయన్ వి. సత్య స్వరూప్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ లయన్స్ క్లబ్‌లలో ఉండి లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అత్యంత ప్రత్యేకమైనవని కొనియాడారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యా రంగానికి మరియు విద్యార్థుల అభివృద్ధికి క్లబ్ అధ్యక్షులు నారాయణ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆయన దాతృత్వాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలోక్లబ్ కార్యదర్శి పెద్దరాజు నరసరాజు తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గాదిరాజు రంగరాజు, రీజియన్ కార్యదర్శి సత్తి బ్రహ్మారెడ్డి, క్లబ్ ఉపాధ్యక్షులు ముదునూరి శివరామరాజు, పెన్మెత్స రంగ ప్రసాదరాజు, క్లబ్ కోశాధికారి కన్నెగంటి రూత్ కళ, క్లబ్ అడ్మిషన్ బుద్దరాజు సుబ్బరాజు, మాజీ అధ్యక్షులు కాగిత మహంకాళి, బొండాడ కేశవరావు, కలిదిండి సీతారామరాజు, నంబూరి కాశి విశ్వేశ్వర రావు, గాదిరాజు వెంకటేశ్వర రాజు, భూపతిరాజు హరనాధ రాజు, వేగేశ్న అనంతలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు .
రిపోర్టర్ ఈతకోట రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా