BREAKING
మామిళ్లపల్లి మాజీ సర్పంచ్ లంకపోతు పిచ్చిరెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన వైసీపీ నేతలు పర్యాటకంగా ఏపీని నంబర్-1 దిశగా నడిపిస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అవనిగడ్డ డిపో నుండి దసరా ప్రత్యేక బస్సులు కళ్యాణదుర్గంలో ఉచిత మెగా గుండె వైద్య శిబిరం. 110 వైద్య పరీక్షలు. రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి 108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం అహ్మదాబాద్‌లో 'బ్రిక్స్ సాంప్రదాయ క్రీడా సంబరాలు' కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన

తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు – మాగుంట

Select Suryaa Now
తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు – మాగుంట

 శింగరాయకొండ గ్రామంలోని శ్రీ చైతన్య నవోదయ విద్యా సంస్థలో  చదువుతున్న విద్యార్ధి, తౌషీక్  ఇటీవల మృతిచెందడం జరిగింది.  ఆ విద్యార్ధి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో నా పాత్ర వుందని యం.ఆర్.పి.ఎస్. వ్యవస్తాపక  అధ్యక్షుడు, మంద కృష్ణ మాదిగ మీడియా సమావేశాలలో చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు.  శ్రీ చైతన్య నవోదయ విద్యా సంస్థతో  నాకు ఎలాంటి సంబంధం లేదు.

ఆ యాజమాన్యాన్ని కాపాడవలసిన అవసరం అంతకంటే నాకు లేదు. విద్యార్ధి మృతి కేసును తారుమారు చేయుటకు నేను ఎవరకీ శిఫార్సు చేయలేదు.

      మా మాగుంట కుటుంబం గురించి ప్రకాశం జిల్లా ప్రజలందరికి  తెలుసు. మా అన్న కీ. శే. శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను కొనసాగించేందుకే మా మాగుంట కుటుంబం రాజకీలలోవున్నది ప్రజలకు  సేవ చేయటమే మా మాగుంట కుటంబ లక్ష్యం. ప్రజల ఆదరణ – ఆశీస్సులతోనే  మా కుటుంబం మూడు దశాబ్దాలకు పైగా జిల్లాలో రాజకీయం చేస్తూ, ప్రజలకు సేవలు చేస్తుందని పత్రికా ముఖంగా తెలిజేయుచున్నాను. అసత్య ఆరోపణలు చేసే ముందు మా కుటుంబ నేపద్యం తెలుసుకొని మాట్లాడాలి. తౌషీక్ మరణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని మాగుంట కుటుంబం కోరుతున్నది.