సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎంను కలిసిన రైతులు
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు ఇప్పటి వరకూ 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన రైతులు
• సీఎం చంద్రబాబును శాలువాతో సత్కరించిన డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు
• కృష్ణాడెల్టాకు గోదావరి వరద నీరు, శ్రీశైలంలో పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చి ఏపీకి జలప్రదాత అయ్యారన్న రైతులు
• అన్ని ప్రాంతాలకూ నీటి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి ఏపీ వాటర్ మాన్ అంటూ రైతుల ప్రశంసలు
• పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటితో కృష్ణాడెల్టాలో సిరులు పండించారని రైతులను కొనియాడిన ముఖ్యమంత్రి
• పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీరు కృష్ణాబేసిన్‌కు తరలించి సద్వినియోగం చేసుకున్నామన్న సీఎం
• ఈ ప్రాజెక్టుతో సాధించిన జలవిజయం సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి
• పట్టిసీమ లిఫ్టు ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు రైతులూ సహకరించారన్న సీఎం
• కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన సీఎం
• పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందన్న సీఎం.
• కృష్ణాబేసిన్‌లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణాజలాలు రాయలసీమలో సాగు, తాగునీటికి మళ్లించామని వెల్లడి
• రాయలసీమలో కియా లాంటి ప్రతిష్టాత్మ పరిశ్రమలకు కూడా నీరివ్వగలిగామన్న ముఖ్యమంత్రి
• ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జల భద్రత తెస్తామన్న సీఎం