BREAKING
రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం వికారాబాద్‌ జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు ఎస్పీ మీనాను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ను కలిసిన మాజీ జడ్పిటిసి పట్లోళ్ల రాములు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం

బీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలి డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం: బీసీ హక్కుల పోరాట సమితి

Select Suryaa Now
బీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలి  డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం: బీసీ హక్కుల పోరాట సమితి

సూర్య, మంచిర్యాల: బీసీలకు సామాజిక న్యాయం కల్పించడంతో పాటు జనాభా ప్రాతిపదికన హక్కులు, నిధులు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు.రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయడంతో పాటు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేసి, బీసీల జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో బీసీలకు రోస్టర్ విధానాన్ని అమలు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని, జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు చేయాలని, బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నాయకులు పేర్కొన్నారు. బీసీల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.బీసీల సమస్యల పరిష్కారంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని వీడకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. బీసీల హక్కుల సాధన కోసం అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం, శాఖపురం భీమసేన్, వేముల కిరణ్, గులాము హుస్సేన్, కొట్టే నటేశ్వర్, చలమల అంజయ్య, కీర్తి రవి, ఎండీ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.