బీసీలకు పూర్తి అండగా టీడీపీ
స్థానికసంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాలని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో, ఈ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడమే ఎన్డీయే (NDA) లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రిజర్వేషన్ల వివరాలను ఆయన వెల్లడించారు. రేపు రిజర్వేషన్ల లిస్ట్ వస్తుందని, పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్ ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని, గ్రామ పంచాయతీ వార్డులకి 26.73 శాతం రిజర్వేషన్ కేటాయించినట్లు చెప్పారు. అలాగే సర్పంచులకు 27 శాతం, MPTCలకు 25 శాతం, MPPలకు 24 శాతం, ZPTCలకు 26 శాతం, ZP చైర్మన్లకు 23 శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.