మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు.
మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు.
(దుమ్ముగూడెం, సూర్య మేజర్ న్యూస్)::
మండల పరిధిలోని మంగువాయిబాడవ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను స్థానిక సర్పంచ్ జయరావు శనివారం ఘనంగా ప్రారంభించారు.పండుగ మొదటి రోజైన ఎంగిల పూల బతుకమ్మను పురస్కరించుకుని గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.రంగురంగుల పూలతో ఎంతో సుందరంగా బతుకమ్మలను తీర్చిదిద్ది గ్రామ వీధుల్లో మహిళలు,యువతులు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ పాటలకు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడిపాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తునికి జయరావు,గ్రామ పటేల్ కల్లూరి వెంకటేశ్వరరావు,రాము,మహిళలు కల్లూరి బాయమ్మ, మరియమ్మ, సమ్మక్క, మమత, లక్ష్మి, ఆదిలక్ష్మి, విజయశ్రీ,కావేరి, నాగమణి, సుభద్ర, భద్రమ్మ పాల్గొన్నారు.
దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్.. సుమన్