BREAKING
బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు

ఓట్ల దొంగ జ్ఞానేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

Select Suryaa Now
ఓట్ల దొంగ జ్ఞానేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్  దేశంలో అత్యున్నత స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేష్ కుమార్ అధికార బీజేపీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని సీఐటీయూ జిల్లా నాయకులు ఎం. గోపాల్, మండల కార్యదర్శి ఎన్. రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజల విలువైన ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్నారంటూ సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం వెల్దుర్తి బస్ స్టాండ్ వద్దగల తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం. గోపాల్ మాట్లాడుతూ.. బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్ఐఆర్ (SIR) పేరుతో దాదాపు 16 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించడం దారుణమన్నారు. జ్ఞానేష్ కుమార్ తన తోటి ఇద్దరు కమిషనర్లకు కూడా తెలియకుండా, బీజేపీ గెలుపే లక్ష్యంగా ఓట్ల చేర్పింపుకు సంబంధించిన ఫారం-6 లో పలు మార్పులు చేశారని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అత్యున్నత సుప్రీంకోర్టును సైతం ఆయన బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుకు బాధ్యుడైన సీఈసీని బర్తరఫ్ చేయాలని విపక్షాలు, ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే.. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలు విద్యార్థులు, ప్రదర్శనకు దిగిన వారిపై పోలీసులతో లాఠీచార్జీలు చేయిస్తూ, అరెస్టులతో తమ ఏజెంటును కాపాడుతున్నారని దుయ్యబట్టారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తున్న జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించే వరకు పోరాటాలు ఆపేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యు. నాగరాజు, మారెన్న, పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం