BREAKING
వెలుగొండ సందర్శనకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు..! మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన సూచన... రేపటి నుండి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు విజయవాడ సెంట్రల్‌లో కూటమి విజయమే లక్ష్యం కొత్త లగ్జరీ కారు కొన్న 'ప్రేమలు' హీరో నస్లెన్.. ధర ఎన్ని కోట్లు అంటే! ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు! 132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం గురవరాజుపల్లి మినీ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం... ఆరోగ్య భీమా కార్డుల పంపిణీ హైడ్రా-తో నగర చెరువులన్నీ సుందరవనాలు: భాగ్యనగరానికి సరికొత్త జల వైభవం కాశి కాలభైరవ స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే? వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు పండగలు లేదా వరుస సెలవులు వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ

కరీంనగర్ రెడ్‌క్రాస్ ఎన్నికల్లో అవకతవకలు.. గవర్నర్‌కు ఫిర్యాదు

Select Suryaa Now
కరీంనగర్ రెడ్‌క్రాస్ ఎన్నికల్లో అవకతవకలు.. గవర్నర్‌కు ఫిర్యాదు

 సూర్య కరీంనగర్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అడ్వకేట్, మాజీ కార్పొరేటర్, రెడ్‌క్రాస్ లైఫ్ మెంబర్ ఏ.వి. రమణ ఆరోపించారు. ఎన్నికలకు ముందు 10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వ్యవస్థలతో సంబంధం ఉన్నవారికి సభ్యత్వాలు కల్పించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, టీఎన్జీవోస్ శాఖ పాత్రపై విచారణ చేపట్టాలని, ఓటర్ల జాబితాలు, సభ్యత్వ రికార్డులు, ఎన్నికల ఖర్చులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఆర్డీవో మహేశ్వర్‌తో పాటు మరికొందరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న సమాచారాన్ని అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించాలని కోరారు. ఎన్నికలపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గాన్ని చట్టప్రకారం రద్దు చేసి, స్వతంత్ర అధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఏ.వి. రమణ డిమాండ్ చేశారు.