BREAKING
దుర్గ ఉత్సవాలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకునికి ఆహ్వానం ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు: చమురు ఒప్పందంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు! కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి! మండపేటలో మెగా వైద్య శిబిరం బొంరాస్‌పేట్‌లో రేపు విద్యుత్ అంతరాయం 16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక 11న బిజెపి ఆత్మీయ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం విద్యుత్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?. చీకట్లోనే బతుకమ్మ సంబరాలా? ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు సూర్యలంకలో అలల బీభత్సం: ఇద్దరు గల్లంతు* *ముగ్గురికి తప్పిన ప్రమాదం - భద్రతా వైఫల్యంపై విమర్శలు

పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు!

Select Suryaa Now
పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు!

దగదర్తి, మేజర్ న్యూస్:  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా దగదర్తి మండలం దామవరం పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు.

భారీ గజమాలతో ఘన స్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పల్లె పండుగ 3.0 కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత లభిస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.