BREAKING
భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు. ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ దశాబ్దం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాన్.. డిసెంబర్‌లో సినిమా విడుదల! ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమా రీ-ఎడిట్?.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! మెక్సికో తీరం వెంబడి దూసుకొస్తున్న 'సైమన్' తుఫాను అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి ఎల్‌నినో పరిస్థితులపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం పసిఫిక్ మహాసముద్రపు అటాల్ వైపు బయలుదేరిన పరిశోధకుల బృందం పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి - జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

మండపేటలో మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
మండపేటలో మెగా వైద్య శిబిరం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 : ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (ఐ వై ఎం) మండపేట శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 11, ఆదివారం మెగా వైద్య పరీక్షల శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ మండపేట అధ్యక్షుడు అబ్దుల్ హామీద్ శనివారం తెలిపారు. మండపేట పట్టణంలోని గాంధీనగర్ అల్ అమీన్ మసీదు వద్ద ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య పరీక్షల శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు. వరదా స్కానింగ్ సెంటర్  సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో థైరాయిడ్, కిడ్నీ, షుగర్, లివర్, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ తదితర వైద్య పరీక్షలను అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షను కేవలం రూ.700కే చేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అబ్దుల్ హామీద్ తెలిపారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. మండపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మెగా మెడికల్ టెస్ట్ క్యాంప్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.