BREAKING
ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, విశ్రాంత సైనిక వీరుడి కల నెరవేర్చాలి: ప్రజల నినాదం ఎమ్మెల్యే బొలిశెట్టి కి అభినందనలు తెలిపిన తెలుగుదేశం నాయకులు తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం నిత్యాన్నదాన పథకానికి విరాళాలు 400 కోట్ల క్లబ్‌లో 'దృశ్యం 3'.. అజయ్ దేవగన్ ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్! ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు చేపడుతున్న 'విమెన్ డ్రాప్ ఎట్ హోమ్' సేవలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మరోసారి చాటుకున్నాయి. సీఈసి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి:- వామపక్షాల డిమాండ్ 'భాషా 2', 'పేట్టా 2' కాదు అన్న రజినీకాంత్.. నెల్సన్‌తో 'జైలర్ 2' చేయడానికి కారణమిదే! కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. గురువుగా మారి సరికొత్త పాఠాలు! శెట్టూరు లో వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం. ఎస్ఐర్ పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపు..జ్ఞానేశ్వర్ చిత్రపటాలను దగ్ధం కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించిన మంత్రి తుమ్మల పేదలకు జీవనోపాధి కల్పించడమే పీ4 లక్ష్యం చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ: సీఎం విజయ్‌తో భేటీ, నేడు విద్యార్థులతో ముఖాముఖి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే  బి. ఎన్. విజయ్ కుమార్

ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ గారు ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజల నుండి మొత్తం 60 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే గారు వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో, వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు.ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా, ఎక్కువశాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ప్రజా సమస్యలను సాంకేతిక,ఆర్థికపరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పని చేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు భరోసా ఇచ్చారు.
  ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.