ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు: చమురు ఒప్పందంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు!
సూర్య అంతర్జాతీయ & వాణిజ్య డెస్క్: అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ తాజా ఒప్పందం ప్రకారం.. అమెరికా మరియు అంతర్జాతీయ మార్కెట్లకు రష్యా తక్షణమే 3,00,000 టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల స్థిరీకరణకు, మార్కెట్లలో కొరతను నివారించేందుకు ఈ చర్య దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన పలు దేశాలపై ఆంక్షలు విధించిన ట్రంప్, ఇప్పుడు స్వయంగా రష్యాతో ఇంధన కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం, సరఫరా గొలుసుల్లో ఒడుదొడుకుల నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రపంచ చమురు మార్కెట్లలో సరికొత్త సమీకరణాలకు