BREAKING
ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, విశ్రాంత సైనిక వీరుడి కల నెరవేర్చాలి: ప్రజల నినాదం ఎమ్మెల్యే బొలిశెట్టి కి అభినందనలు తెలిపిన తెలుగుదేశం నాయకులు తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం నిత్యాన్నదాన పథకానికి విరాళాలు 400 కోట్ల క్లబ్‌లో 'దృశ్యం 3'.. అజయ్ దేవగన్ ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్! ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో మహిళల రక్షణే ధ్యేయంగా పోలీసులు చేపడుతున్న 'విమెన్ డ్రాప్ ఎట్ హోమ్' సేవలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మరోసారి చాటుకున్నాయి. సీఈసి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి:- వామపక్షాల డిమాండ్ 'భాషా 2', 'పేట్టా 2' కాదు అన్న రజినీకాంత్.. నెల్సన్‌తో 'జైలర్ 2' చేయడానికి కారణమిదే! కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. గురువుగా మారి సరికొత్త పాఠాలు! శెట్టూరు లో వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం. ఎస్ఐర్ పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపు..జ్ఞానేశ్వర్ చిత్రపటాలను దగ్ధం కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించిన మంత్రి తుమ్మల పేదలకు జీవనోపాధి కల్పించడమే పీ4 లక్ష్యం చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ: సీఎం విజయ్‌తో భేటీ, నేడు విద్యార్థులతో ముఖాముఖి

16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక

Select Suryaa Now
16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక

సూర్య, నంద్యాల బ్యూరో:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా వేదికగా జరుగుతున్న 16వ జాతీయ సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున నంద్యాల జిల్లాకు చెందిన క్రీడాకారుడు శ్రావణ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్య రాజు అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ జాతీయ స్థాయి పోటీలు కొనసాగనున్నాయి. టోర్నమెంట్‌లో భాగంగా అక్టోబర్ 10న జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు గుజరాత్ జట్టుతో తలపడింది. ఈ హోరాహోరీ పోరులో ఆంధ్రప్రదేశ్ జట్టు 8-0 గోల్స్ తేడాతో గుజరాత్‌పై అఖండ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో నంద్యాల క్రీడాకారుడు శ్రావణ్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్య రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్‌తో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో జరగనున్న మిగతా మ్యాచ్‌లలోనూ ఇదే జోరు కొనసాగించి, జట్టు ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*