వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు
వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని చెక్ పోస్టు వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్ద పెట్రోల్ బంకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను ఆర్ అండ్ బి ,మున్సిపల్ అధికారులు పోలీసులు బందోబస్తు నడుమ జేసిబి తో శనివారం ఆక్రమణలు తొలగించారు .వైఎస్సార్ విగ్రహం వద్ద ఒంగోలు రహదారిలో ఆర్ అండ్ బి రహదారికి ఇరువైపులా పలువురు ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు .ఆక్రమ నిర్మాణాలు వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది .వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఆక్రమణలు తొలగింపుకు శ్రీకారం చుట్టారు .