BREAKING
ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు: చమురు ఒప్పందంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు! కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి! మండపేటలో మెగా వైద్య శిబిరం బొంరాస్‌పేట్‌లో రేపు విద్యుత్ అంతరాయం 16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక 11న బిజెపి ఆత్మీయ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం విద్యుత్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?. చీకట్లోనే బతుకమ్మ సంబరాలా? ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు సూర్యలంకలో అలల బీభత్సం: ఇద్దరు గల్లంతు* *ముగ్గురికి తప్పిన ప్రమాదం - భద్రతా వైఫల్యంపై విమర్శలు అమావాస్య సందర్భంగా మహాదేవప్ప తాత మఠాన్ని దర్శించుకున్న కాపు రామచంద్రారెడ్డి

విజయవాడ సెంట్రల్‌లో కూటమి విజయమే లక్ష్యం

Select Suryaa Now
విజయవాడ సెంట్రల్‌లో కూటమి విజయమే లక్ష్యం

29 కార్పొరేటర్ స్థానాల్లోనూ గెలుపే ధ్యేయం: బొండా ఉమా

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సామినేని ఉదయభాను శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతూ విజయవాడ నగరపాలక సంస్థపై కూటమి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఇరువురు నేతలు చర్చించారు. సీట్ల పంపకాల విషయంలో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తూ, ప్రతి డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీకి 10 కార్పొరేటర్ స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరినట్లు తెలిపారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ మూడు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి, పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 29 కార్పొరేటర్ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి బలపడితే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తారని పేర్కొన్నారు.


✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.