BREAKING
దుర్గ ఉత్సవాలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకునికి ఆహ్వానం ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు: చమురు ఒప్పందంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు! కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి! మండపేటలో మెగా వైద్య శిబిరం బొంరాస్‌పేట్‌లో రేపు విద్యుత్ అంతరాయం 16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక 11న బిజెపి ఆత్మీయ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం విద్యుత్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?. చీకట్లోనే బతుకమ్మ సంబరాలా? ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు సూర్యలంకలో అలల బీభత్సం: ఇద్దరు గల్లంతు* *ముగ్గురికి తప్పిన ప్రమాదం - భద్రతా వైఫల్యంపై విమర్శలు

ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ  సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

అనంతపురం బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సైతం నిరసన కార్యక్రమానికి హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.