రేపటి నుండి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు
రేపటి నుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు
బాలాపూర్ మండలం, జల్ పల్లి సర్కిల్ పరిధి, మామిడిపల్లిలో వెలసిన అతి ప్రాచీనమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు 11ఆదివారం నుండి 16శుక్రవారం వరకు వారం రోజులపాటు బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఆలయ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్ తెలిపారు. ఆలయ ఈఓ మురళీకృష్ణ, డైరెక్టర్లు చీమలదారి చెన్నయ్య, గొండ్యాల శేఖర్, ఎలిగపల్లి అనిత, కానుగల భాస్కర్, గుర్జని రాధిక, ఉండేకారి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, భక్తుల సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నాడు అంకురార్పణ తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించి,12 సోమవారం బాల భోగము, యాగశాల ప్రవేశము, విష్ణు సహస్ర పారాయణం నిర్వహించనున్నారు. 13న మంగళవారం 11గంటలకు స్వామివారి తిరు కళ్యాణం, అన్న ప్రసాద వితరణ ఉంటుందని, సాయంత్రం 6గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, హవనము, శేష వాహన సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 14,15 16న బాలభోగము, హవనము, బలిహారము, మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.