జనగామ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా. సూర్య ప్రతినిధి,తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపు కోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షిం చారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జనగామ నియోజక వర్గ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఆయన హృద యపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు మహిళల్లో ఆనందోత్సాహాలను నింపుతాయి. తరతరాలుగా కొనసాగుతున్న బతుకమ్మ సంస్కృతి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.
తెలంగాణ నేలతో, ప్రకృతితో, ప్రజల జీవన విధానంతో విడదీయలేని అనుబంధం కలిగిన పండుగ బతుకమ్మ. పూలను పూజిస్తూ ప్రకృతి లోని అందాలను ఆరాధించడం, మహిళలంతా ఒకచోట చేరి పాటలు పాడుతూ, ఆటలాడుతూ సంబరాలు చేసుకోవడం ఈ పండుగ ప్రత్యే కత. తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతిని, మహిళల ఐక్యతను ప్రతి బింబించే బతుకమ్మ వేడుకలు మన ప్రాంతీయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి.
తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. రాష్ట్ర సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మన పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు వాటి గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలు ప్రతి ఇంటా సంతో షాన్ని నింపాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆడపడుచులందరూ కుటుం బ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని కోరారు.