BREAKING
కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి! మండపేటలో మెగా వైద్య శిబిరం బొంరాస్‌పేట్‌లో రేపు విద్యుత్ అంతరాయం 16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక 11న బిజెపి ఆత్మీయ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం విద్యుత్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?. చీకట్లోనే బతుకమ్మ సంబరాలా? ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు సూర్యలంకలో అలల బీభత్సం: ఇద్దరు గల్లంతు* *ముగ్గురికి తప్పిన ప్రమాదం - భద్రతా వైఫల్యంపై విమర్శలు అమావాస్య సందర్భంగా మహాదేవప్ప తాత మఠాన్ని దర్శించుకున్న కాపు రామచంద్రారెడ్డి 14న రాజమహేంద్రవరంలో జాబ్ మేళ రణబాలి రూ. 120 కోట్ల బడ్జెట్.. విజయ్‌, రష్మికల పారితోషికం ఎంతో తెలుసా?

యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం...

Select Suryaa Now
యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం...

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి క్రికెట్ కప్ విజేతలకు నగదు బహుమతులు అందజేత

నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్:  యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.  నెల్లూరులోని 9వ డివిజన్ నవాబుపేటలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన జట్లకు నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ నిర్వాహకుడు బిలాల్‌తో కలిసి విజేతలు, రన్నరప్ జట్లను అభినందించారు. ఈ సందర్భంగా విజేత జట్టుకు మొదటి బహుమతిగా రూ.20,000, రన్నరప్ జట్టుకు రెండో బహుమతిగా రూ.10,000 నగదు బహుమతులను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.

క్రీడలతోనే యువతలో క్రమశిక్షణ, పట్టుదల!  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ వివిధ క్రీడల్లో రాణించడం ఎంతో సంతోషకరమని అన్నారు. యువత తమలోని ప్రతిభను గుర్తించి, నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.  రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లలో పాల్గొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నెల్లూరుకు మంచి పేరు తీసుకురావాలని యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.  యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లు భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.