రాజ్ భవన్ ముట్టడికి యత్నం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
‘చలో రాజ్‌భవన్’ ముట్టడి కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరైన మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావును విజయవాడ సిటీ పోలీసులు అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుండి ఫోన్ లో స్తానిక మీడియా తో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కామన ప్రభాకరరావు మాట్లాడుతూ అరెస్టులు తమకు కొత్త కాదని పేర్కొన్నారు. తమ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను దాదాపు మూడు రోజులుగా అక్రమంగా అరెస్టు చేస్తున్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్రపతికి కామన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తొలగించాలన్నారు.ఓటర్ల జాబితా సవరణపై వామపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళన ఉధృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆయన ఆరోపించారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని, ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని పేర్కొన్నారు.