రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల ఆచూకీలభ్యం
అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి పట్టణం సమీపంలో చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల వివరాలు లభ్యమయ్యాయి.
మృతులు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గొల్లల దొడ్డికి చెందిన పురుషోత్తం, భార్గవ్ లుగా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం నుండి కొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.