BREAKING
దసరా సెలవుల్లో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం గా కావాలి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌పై పిమ్‌కో హెచ్చరిక టీసీఎస్ ఏఐ వ్యూహంలో 'కీ-మ్యాన్' రిస్క్ అమెరికా క్రూడాయిడ్ దిగుమతులకు ఆసియా దేశాల బ్రేక్ ఫ్రాన్స్‌లో సర్కారు బడులకు పెరుగుతున్న గుదిబండ బ్యాంకులు, ఏజెన్సీల దిగుమతులపై 3 శాతం ఐజీఎస్‌టీ విధింపు యూరోపియన్ కార్ల తయారీదారులకు పెరుగుతున్న ఒత్తిడి సరిహద్దు పెట్టుబడులకు అడ్డుగా మారుతున్న నిబంధనల గోడలు అమెరికాలోనూ తగ్గుతున్న కొనుగోళ్లు, గడ్డుకాలం ఎదుర్కొంటున్న దిగ్గజాలు రఫీ వైద్యానికి మంత్రి గొట్టిపాటి భరోసా.. రూ.1.73 లక్షల LOC మంజూరు. నెమ్మదిగా సాగుతున్న చైనా బుల్ మార్కెట్ కృత్రిమ మేధస్సు ఐపీవోలకు ఎదురుదెబ్బ అమెరికాలో ఉత్కంఠ రేపుతున్న టర్మ్ ప్రీమియం పెరుగుదల ఉక్రెయిన్ నగరాలను వేధిస్తున్న గగనతల రక్షణ కొరత సిద్దిపేట జిల్లా దశాబ్ది సంబురాలు ప్రారంభం: హరీష్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా 10K రన్!

చెల్లాపూర్‌లో రోడ్డుపై మురుగునీరు.. పట్టించుకోని అధికారులు

Select Suryaa Now
చెల్లాపూర్‌లో రోడ్డుపై మురుగునీరు.. పట్టించుకోని అధికారులు

దౌల్తాబాద్, మేజర్ న్యూస్: మండలంలోని చెల్లాపూర్ గ్రామం 6వ వార్డులో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని స్థానిక యువకుడు గుండిమల్ల మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.మురుగునీరు రోడ్డుపై నిలిచి దుర్వాసన వెదజల్లడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మహేష్ కోరారు.

రిపోర్టర్: శ్యాంసుందర్, దౌల్తాబాద్, వికారాబాద్ జిల్లా.