జడ్పీ హైస్కూల్ కు ఆట వస్తువులు వితరణ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ పదివేల రూపాయల విలువైన ఆట వస్తువులను గురువారం వితరణగా అందించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల కోసం విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు కోసూరు పూర్ణచంద్రరావు దాతల సహకారంతో రూ.10 వేల విలువైన ఆట వస్తువులను సమకూర్చగా, అవనిగడ్డ సీఐ యువకుమార్ చేతులమీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మత్తి నాగమల్లేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల పీడీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా